Surprise Me!

Telangana Art Teachers Protest Against Unemployment | Oneindia Telugu

2017-11-01 53 Dailymotion

Telangana Art Teachers protest against unemployment in Telangana state on Wednesday. <br />టీ ఆర్ట్ టీచర్స్ ఆధ్వర్యంలో ఆందోళన <br />తెలంగాణ ఆర్ట్ టీచర్స్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ తార్నాకలోని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం ఇంటి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. నిరుద్యోగ ఆర్ట్ టీచర్లను ఆదుకోవాలని, డీఎస్సీలో ఆర్ట్‌ను చేర్చాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ ఆర్ట్ టీచర్స్ నిరుద్యోగుల సంఘం తరఫున వారు నిరసన చేపట్టారు. <br />తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం తార్నాకలోని తన ఇంట్లో మంగళవారం 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం సాగుతున్న ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని మండిపడ్డారు.జేఏసీపై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరినే ఈ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిరంకుశ, నిర్బంధ వైఖరికి నిరసనగా దీక్షను చేపట్టానన్నారు. కొలువులకై కొట్లాట సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించిన దీక్షను బుధవారం మూడు గంటలకు ముగిస్తారు. <br />

Buy Now on CodeCanyon